డిగ్రీ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ గడువు పొడిగింపు యూజీ అడ్మిషన్ల గడువు పెంపు 25 వరకు రిజిస్ట్రేషన్కు అవకాశం 26 నుంచి వెబ్ ఆప్షన్ల నమోదు
.డిగ్రీ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ గడువు పొడిగింపు యూజీ అడ్మిషన్ల గడువు పెంపు 25 వరకు
డిగ్రీ ఆన్లైన్ దరఖాస్తు గడువును ఉన్నత విద్యామండలి పొడిగించింది. 2021-22 విద్యా సంవత్సరం అడ్మిషన్ల రిజిస్ట్రేషను ఈ నెల 25 వరకు అవకాశం కల్పిస్తున్నట్లు ఉన్నత విద్యామండలి కార్యదర్శి సుధీర్ ప్రేమ్ కుమార్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.
హెల్ప్ లైన్ కేంద్రాలను 53 డిగ్రీ కళాశాలల్లో ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ప్రత్యేక విభాగం విద్యార్థులు గురు, శుక్రవారాల్లో విశాఖపట్నం, విజయవాడ, తిరుపతిలో ఉన్న హెల్ప్న్ కేంద్రాల్లో సర్టిఫికెట్ల పరిశీలన చేసుకోవాలని తెలిపారు.
ఈ నెల 26 నుంచి అక్టోబరు 2 వరకు వెబ్ ఆప్షన నమోదు. ఉంటుందని పేర్కొన్నారు. సీట్ల కేటాయింపు అక్టోబరు 5న చేస్తామని, 6 నుంచి తరగతులు ప్రారంభమవుతాయని వెల్లడించారు.
రాష్ట్రంలో అన్ని డిగ్రీ కళాశాలల్లో యూజీ కోర్సుల్లో ప్రవేశాలకు అడ్మిషన్ల గడువును పొడిగిస్తున్నట్లు ఉన్నత విద్యామండలి ప్రకటించింది. బుధవారం విడుదల చేసిన ప్రకటనలో గడువు తేదీని ఈ నెల 25 వరకు పెంచినట్లు ఉన్నత విద్యామండలి కార్యదర్శి ప్రొ. బి. సుధీర్ ప్రేమక్కుమార్ తెలిపారు.
పూర్తి ఆన్లైన్ విధానంలో ఈ ప్రక్రియ కొనసాగనుంది. యూజీలోని ఆర్ట్స్, సైన్సెస్, సోషల్ సైన్సెస్, కామర్స్, మేనేజ్మెంట్, కంప్యూటర్ అప్లికేషన్స్, సోషల్ వర్క్, హానర్స్ విభాగాలకు సంబంధించి అడ్మిషన్లకు దరఖాస్తు చేసుకోవచ్చు. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రభుత్వ అటానమస్, ప్రైవేట్ ఎయిడెడ్, అన్ఎయిడెడ్, ప్రైవేట్ అటానమస్ డిగ్రీ కళాశాలల్లో ఆన్లైన్ విధానంలో అడ్మిషన్లు నమోదు చేసుకోవచ్చు.
ఈ నెల 23, 24 తేదీల్లో స్పెషల్ కేటగిరి వెరిఫికేషన్ కోసం విశాఖపట్నం, విజయవాడ, తిరుపతిల్లో ఏర్పాటు చేసిన హెల్ప్ లైన్ సెంటర్లకు అభ్యర్థులు హాజరు కావాలి.
ఈ నెల 26 నుంచి అక్టోబర్ 2 వరకు వెబ్ ఆప్షన్స్ పరిశీలన ఉండనుంది. అక్టోబర్ 5న సీట్ల కేటాయింపు జరుగుతుంది. సీట్లు పొందిన విద్యార్థులు తమ తమ కళాశాలల్లో అక్టోబర్ ఆరో తేదీన రిపోర్ట్ చేయాల్సి ఉంటుందని కార్యదర్శి ప్రొ. బి. సుధీర్ ప్రేమ్ కుమార్ సూచించారు.
Get Online Apply Candidates Online login Click here
0 comments:
Post a Comment
Note: only a member of this blog may post a comment.